నెన్నెల, ఏప్రిల్ 29, (జనంసాక్షి )నెన్నెల మండలం జంగాల్ పేట గ్రామంలో శనివారం పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీరామరావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలు పల్లెలకు ముంగిటకు తీసుకు రావడానికి పోస్టఫీస్ ప్రారంభించమన్నారు. ప్రారంభించిన మొదటి రోజే 60 పొదుపు ఖాతాలు అయ్యాయని, మున్ముందు మారుమూల ప్రాంతాలకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. అనంతరం స్థానిక సర్పంచ్ రావుల సత్యనారాయణ మాట్లాడుతూ మారుమూల జంగాల్ పేట గ్రామంలో పోస్టల్ సేవలు ప్రారంభించడం సంతోషదాయకం అని, ఇంతకు మునుపు ప్రతి చిన్న పనికి మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదని, కానీ పోస్టల్ సేవలు ప్రారంభించడం వల్ల తమ కష్టాలు కొంతలో కొంత తిరినట్టే అన్నారు. ఉప సర్పంచ్ నాయిని చిలుకయ్య, పోస్టల్ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.




