Monday, 2 November 2026

కొల్చారం  మండల వ్యాప్తంగా అకాల వర్షాలకు జరిగిన పంట నష్టంజడ్పిటిసి మేఘమాల సంతోష్ 

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి/ కొల్చారంఅకాల వర్షాలకు నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని కొల్చారం జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్ అన్నారు.   కొల్చారం మండల కేంద్రంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు మండల వ్యాప్తంగా సుమారు మూడువేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆమె తెలిపారు రైతులు అధైర్య పడవద్దు అని సూచించారు. అయితే క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రావడంలేదని తమ పంట నష్టం వివరాలను సేకరించడం లేదని రైతులు వాపోతున్నారు తమ వ్యవసాయ క్షేత్రానికి వచ్చి పూర్తిస్థాయి పంట నష్టం అంచనా వేయాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు