జంగో – లింగో దీక్షలు పవిత్రమైనవి…
–
ఇంద్రవెల్లి : ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని కానిస్టేబుల్లు దుర్వా వెంకట రమణ, సంతోష్ అన్నారు. బుధవారం మండలంలోని ముత్నూర్ గ్రామంలోని తమ నివాసంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జంగో లింగో దీక్ష పరులకు అన్నదానం చేశారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీక్ష గురువు ఆత్రం కిషన్ జంగో లింగో దేవతల ప్రవచనాలు బోధించారు. పుష్య మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో నియమ నిష్ఠలతో జరుపుకునే దీక్షలు జంగో లింగో దీక్షలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శక్తి బాబా జంగో లింగో ఘన్ సంస్థాన్ పీఠాధిపతి కుమ్ర భగవంతరావ్, పుర్క బాపురావ్, పెందుర్ పుష్పరాణి, పెందుర్ అర్జున్, పెందుర్ ప్రభాకర్,ఆత్రం రఘునాథ్, కొడప నగేష్,అడ హనుమంతు, పుర్క చిత్రు, మూత్నూర్ గ్రామ పటేల్ హేరా కుమ్ర జంగు, సర్పంచ్ భాగుబాయి,ఎంపీటీసీ కోవ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.




