గ్రంథాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన హరి సింగ్ నాయక్
టేకులపల్లి, జనవరి 4( జనం సాక్షి): ఎల్ టి ఎస్ టి ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిధులు ఏర్పాటు చేసిన గ్రంథాలయ భవన నిర్మాణానికి బుధవారం ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు హరి సింగ్ నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఇలాంటి ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో పుస్తక సముదాయాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయం అన్నారు. ఈ సందర్భంగా ఎల్ టి ఎస్ టి ఎంప్లాయిస్ అసోసియేషన్‌కు అభినందనలు తెలిపారు. అసోసియేషన్ తీసుకున్న నిర్ణయానికి భవిష్యత్తులో ఎంతోమంది విద్యార్థులకు ఈ గ్రంథాలయం ఒక గొప్ప నిధి కాబోతుందని ఆయన ప్రశంసించారు. అసోసియేషన్ గ్రంథాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరి సింగ్ నాయక్ తమవంతుగా లక్ష రూపాయలు గతంలోనే విరాళంగా ప్రకటించిన సంగతి విధితమే. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరెన్నో బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన విశ్వసించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బానోతు రామ నాయక్, దాసుతండా గ్రామపంచాయతీ సర్పంచ్ బానోతు ప్రియాంక , ఎంపీటీసీ బాలకృష్ణ, స్థల (దాతలు ):భూక్యా ఫులియ, భుక్యా నంద,భూక్యా ద్వాలియా, లచ్చతండా నాయక్ గుగులోతు నరేందర్ ,భూక్యా గన్నా , అసోసియేషన్ సభ్యులు గుగులోతు మోతిలాల్, లకుపతి, నర్సింగ్, వెంకన్న,బోడ గన్నా,రాహుల్, నాకా తదితరులు పాల్గొన్నారు.




