Wednesday, 4 November 2026

జంటనగరాల్లో పోలీసులు అప్రమత్తం

హైదరాబాద్‌: నిఘా వర్గాల హెచ్చరికలతో జంటనగరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. జనసమ్మర్ద ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దేవాలయాలు, జనసమ్మర్ద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. బాంబు  పేలుళ్ల ఘటనలో సేకరించిన ఆధారాలను ఎన్‌ఐఏకు అప్పగించామన్నారు. వ్యాపార సంస్థల సహకారంతో నగరంలో మరో 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని కమిషనర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *