Tuesday, 3 November 2026

జంతర్ మంతర్ దీక్షలో పాల్గొన్న కోరుట్ల నియోజకవర్గ జన సమితి నాయకులు

 

 

 

 

 

 

 

మెట్పల్లి టౌన్, జనవరి30,జనంసాక్షి :
న్యూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జన సమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం సోమవారం చేపట్టిన మౌన నిరసన దీక్షలో కోరుట్ల నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మరియు కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి కంతి మోహన్ రెడ్డి స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ,కృష్ణా జలాల్లో మన వాటా,విభజన హామీల సాధన కొరకై తెలంగాణ వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత కూడా పోరాడవలసి రావడం దురదృష్టకరమన్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం కోసం కాకుండా తన కుటుంబం కోసం మాత్రమే తాపత్రయ పడటం శోచనీయం అన్నారు. కోదండరాం మౌనదీక్షలో పాల్గొన్న వారిలో తెలంగాణ జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి ఎలుక కమలాకర్, కార్యదర్శి చింతకుంట శంకర్,కోరుట్ల,మెట్ పల్లి మండల అధ్యక్షులు శనిగారపు అశోక్, పసునూరి శ్రీనివాస్, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు జిల్లపెల్లి దిలీప్,యువజన సమితి నాయకులు వన్నెల శశి, నాయకులు రెబ్బటి మల్లయ్య, శ్రీపాద లక్ష్మీనర్సయ్య,కలాల ప్రవీణ్, నాచుపల్లి తిరుపతి, అల్లాడి మణిదీప్,కేశపాక తరుణ్, విజయ్ తదితరులు ఉన్నారు.