ఝరా సంగం జనవరి 30( జనం సాక్షి )నిరుపేదలకు అండగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఝరా సంగం సర్పంచ్ జగదీశ్వర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ని గ్రామ పంచాయతీ కార్యాలయం లో మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సర్పంచ్ జగదీశ్వర్ సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఆదేశాల మేరకు లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది అన్నారు.. ఈ కార్యక్రమంలో మాజ్ మండల అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్ పాటిల్, మండల ప్రధాన కార్యదర్శి నర్సిములు పటేల్, టౌన్ ప్రెసిడెంట్ ఎజాజ్ బాబా కృష్ణాపుర్ సర్పంచ్ అమార్జిత్, నాయకులు ముసపాటల్, హసిఫ్ పటేల్,నర్సిములు విఠల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.




