Monday, 2 November 2026

జగదీశ్వర్‌రెడ్డి ఖబడ్దార్‌.. నోరు అదుపులో పెట్టుకో: కాంగ్రెస్‌

హైదరాబాద్‌, మార్చి 25: అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని మంతి జగదీశ్వర్‌రెడ్డిని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ సూచించారు. సభలో జరిగే తంతు ప్రజలు గమనిస్తున్నారని, అడ్డగోలుగా మాట్లాడితే వారే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌ నేతలపై మంత్రి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా సంపత్‌కుమార్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్కార హీనుల చేతుల్లో తెలంగాణను పెట్టబోమని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలలో మీకు ఎన్ని ముడుపులు అందాయో అందరికీ తెలుసని చెప్పారు. బయట తమని ఫైవ్‌ పర్సంట్‌ మినిస్టర్‌ అని అంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘మీలా మాకు సోడా మిక్సింగ్‌, బ్రోకరింగ్‌ రాదు’ అని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *