హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం సీపీఐ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈరోజు సతీసమేతంగా చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిశారు. దాదాపు అరగంటపాటు మంతనాలు జరిపారు. అనంతరం తాము వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. పేద ప్రజలకోసం వైఎన్ ప్రవేశ పెట్టిన సంక్షేయ పథకాలు అమలుకావడం లేదని వెంకటేశ్వర్లు అన్నారు. వైకాపాలో చేరి జగన్‌కు అండగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.




