వాటికన్ సిటీ : పోవ్ ఫ్రాన్సిన్ మంగళవారం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ప్రారంభోత్సవ మాన్‌ను నిర్వహించారు. వేలాది ప్రజలతో పాటు ప్రపంచదేశాల ప్రముఖులు పలువురు ఈ కార్యక్రమాకి హాజరయ్యారు. సర్వీస్ ప్రారంభించడానికి ముందు ఆయన టావ్‌లేని జీపులో 20 నిమిషాల పాటు ప్రజల మధ్య తిరిగారు. పలువురిని దీవించారు. అనంతరం పోవ్‌గా కార్డినల్స్ ఆయన చేత ప్రతిజ్ఞ చేయించారు. నిరాడంబరతను ఇష్టపడే కొత్త పోవ్ బంగారు. ఉంగరానకి బదులు బంగారుపూత పూయించిన వెండి ఉంగరం ధరించడానకి మొగ్గుచూపారు. జర్మన్ ఛాన్సలర్ యాంజెలా మెర్కెల్, యూఎన్ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్, బ్రెజిల్ అధ్యక్షుడు దిల్మా రూజెఫ్, అర్జెంటినా అధ్యక్షుడు క్రిస్టినా ఫెర్నాండెజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూపోపియన్ యూనియన్ ఉత్తర్వులను లెక్క చేయకుండా జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం విశేషం. దాదాపు వెయ్యేళ్ల తర్వాత పురాతన చర్చి ప్రతినిధులంతా పోవ్ తొలి మాన్‌కు హాజరయ్యారని వాటికన్ ప్రతినిధులు పేర్కొన్నారు.




