జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో…
రూ.43వేల కోట్ల ప్రజాధనం నష్టం
జగన్ అక్రమాస్తుల కేసులో మరో 4 అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సివుందని సీబీఐ పేర్కొంది. జగన్ తన కంపెనీల్లోకి భారీ మొత్తాల్ని తన కంపెనీల్లోకి మళ్లించుకున్నారని సీబీఐ తెలిపింది. అక్రమాస్తుల వ్యవహారంలో రూ.43వేల కోట్ల ప్రజాపధం నష్టపోయినట్టు, ఈ కేసులో విదేవీ పెట్టుబడులకు సంబంధించిన లెటర్ ఆఫ్ రెగ్రోట్రీ ద్వారా తదుపరి సమాచారం సేకరిస్తున్నట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. వాక్‌పిక్, భారతీ సింమెట్స్‌లో పెట్టుబడి పెట్టిన ఫ్రాన్స్‌కు చెందిన కంపెనీలతో పాటు పెట్టుబడుల కోసం కోల్‌కత్తాలో నెలకొల్పిన సూట్‌కేసు కంపెనీల వివరాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు దర్యాప్తు సంస్థ తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసులో మరో 4 అభియోగపత్రాలు దాఖలు చేయాల్సివుందని సీబీఐ వెల్లడించింది.