– మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్1(జనంసాక్షి) : విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కత్తిదాడి ఘటనపై వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. గురువారం ఈ మేరకు కోర్టు వెల్లడించింది. ప్రతిపక్ష నేతగా తనపై హత్యకు పైస్థాయిలో భారీ కుట్ర పన్నారని, అది విఫలం కావటంతో మొత్తం వ్యవహారాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. ఇందులో భాగంగానే ‘ఆపరేషన్ గరుడ’ను తెరపైకి తెచ్చారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై నమ్మకం లేదని, అది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతోందన్నారు. వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతను ఆంధప్రదేశ్ ¬ంశాఖ, డీజీపీల అజమాయిషీలోలేని స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విధితమే. కాగా జగన్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దాడి వెనుక కుట్ర ఉందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ అడ్వకేట్ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు అవసరం లేదన్నారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఇదిలాఉంటే అంతకు ముందే జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి వైవీ సుబ్బారెడ్డి, అరుణ్‌కుమార్ మరొకరు రెండు పిటిషన్‌న్లు దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లను గురువారం పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వీటిపై వచ్చే మంగళవారం విచారణ జరుపనున్నట్లు పేర్కొంది.




