జగన్‌ బెయిల్‌కు హైకోర్టు అనుమతి

హైదరాబాద్‌ : అక్రమ ఆస్తులకేసుకు సంబంధించి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేసిన సీబీఐకి నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. మరోవైపు ఇదే కేసులో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవీ వెంకటరమణకు సంబంధించిన వాన్‌పిక్‌ వ్యవహారంలో హైకోర్టు బెయిల్‌ అనుమతి పిటిషన్‌ను తిరస్కరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఛార్జీషీటు దాఖలై 90రోజులు గడినందున బెయిల్‌ మంజూరు చేయాలని రమణ తరపు న్యాయవాది వాదించారు. అయితే వాన్‌పిక్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అందుకే బెయిల్‌ ఇవ్వకూడదని సీబీఐ న్యాయవాదులు పేర్కొన్నారు. సీబీఐ వాదనతో ఏకీభవించిన హైకోర్టు రమణ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇప్పటివరకు ఆయన బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు రెండుసార్లు, హైకోర్టు రెండుసార్లు తిరస్కరించింది.