Tuesday, 3 November 2026

జగిత్యాల జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షులుగా పల్లికొండ ప్రవీణ్

జగిత్యాల జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షులుగా పల్లికొండ ప్రవీణ్*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 02,
జనంసాక్షి:
హైదరాబాదులో గల సుందరయ్య విజ్ఞాన వేదికలో రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు మెట్టు ధనరాజు ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా పల్లికొండ ప్రవీణ్ ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇట్టి నిర్ణయాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సర్వసభ్య సమావేశంలో ఎన్నికైన సందర్భంగా ప్రశంసంపత్రాన్ని పల్లికొండ ప్రవీణ్ కు అందజేశారు ఇందుకుగాను పల్లికొండ ప్రవీణ్ తన ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు మెట్టు ధనరాజు కు మరియు పలు జిల్లాల నుంచి వచ్చిన పాలకవర్గ కమిటీకి, సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా జాతి మనుగడ కోసం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతర పోరాటం చేస్తున్న పల్లికొండ ప్రవీణ్ జిల్లా గంగపుత్ర సంఘాల అధ్యక్షులుగా ఎన్నికవ్వడం పట్ల, జగిత్యాల జిల్లా గంగ పుత్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.