పేదలకు కళ్యాణ లక్ష్మీ వరం: పేదలకు కళ్యాణ లక్ష్మీ వరం:
పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం వరమనిఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వీణవంక డిసెంబర్ 2 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో 56 మందికి ఒక్కొక్క లబ్ధిదారులకు ఒక లక్ష 116 రూపాయల కళ్యాణ లక్ష్మీ చెక్కలను సీఎంఆర్ఎఫ్ చెక్కులను ముఖ్యఅతిథి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హాజరై వారి తో పాటు ఎంపీపీ మూసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తిర్చదిద్దడానికి సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్న ఏకైక ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు షాదీ ముబారక్.కళ్యాణ్ లక్ష్మీ. దళితులకు దళిత బంధు పథకం. రైతు బీమా రైతు రుణమాఫీ. కెసిఆర్ కిట్టు వికలాంగుల పెన్షన్ వృద్ధులకు పెన్షన్ ఉచిత కరెంటు ఉచిత నీరు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లాంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇలాంటి పథకాలు ఇస్తుంటే భారతదేశంలో బిజెపి పరిపాలించే రాష్ట్రాల్లో ఎక్కడ ఇయ్యలేని పథకాలు మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇస్తున్నారు అని వారన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ రుణపడి ఉండాలని అన్నారు మండలం కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బొడ్రాయి వద్ద ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తోపాటు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు వేద పండితుల మధ్య గూడ జగదీశ్వర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి స్థానిక సర్పంచ్ నీల కుమారస్వామి నాయకులు పిఎసిఎస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎక్కేటి రఘు పాల్ రెడ్డి.మాజీ సింగల్ విండో చైర్మన్ మాడ సాధవరెడ్డి. గంగాడి తిరుపతి రెడ్డి. ట్రస్మా నియోజకవర్గ అధ్యక్షులు ముసిపట్ల తిరుపతి రెడ్డి. ఆయా గ్రామాల సర్పంచులు పోతుల నర్సయ్య. బండ ముత్తయ్య. మేకల సమ్మిరెడ్డి. నాయకులు చదువు మహేందర్ రెడ్డి.చదువు నరసింహారెడ్డి. బండ కిషన్ రెడ్డి. నాగిడి సంజీవరెడ్డి. పుల్లారెడ్డి. వడ్డేపల్లి భూమయ్య. సంగ సమ్మయ్య. దాసరపు లక్ష్మణ్ మర్రి స్వామి. చెక్క బండ సమ్మిరెడ్డి. ఓరేం భానుచందర్ . మేకల సత్తిరెడ్డి. ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు కళ్యాణ లక్ష్మీ వరం: పేదలకు కళ్యాణ లక్ష్మీ వరం:




