Thursday, 5 November 2026

జగ్గంపేటలో వడ్డీ లేని రుణాలు పంపిణి.

 

 

 

 

 

చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :-మండల పరిదిలోని జగ్గంపేట గ్రామంలో అంతార్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ తన్నీరు హరీష్ రావు గారు VLR వడ్డీ లేని రుణాలు 750 కోట్లను విడుదల చేశారు అందులో భాగంగా జగ్గంపేట గ్రామం లో 27 గ్రూప్ లకు 11,32’188 పదకొండు లక్షల ముప్పై రెండు వేల ఒక వంద ఎనబై ఎనిమిది రూపాయల వడ్డీ లేని రుణాలు SHG గ్రూప్ లకు మంజూరు అయ్యాయని తెలిపారు స్థానిక సర్పంచ్ పట్లోళ్ల మాంతప్ప మాట్లాడుతూ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందచేయడంతో SHG సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో మండల బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల అశోక్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్ యస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షులు సికింద్రాపురం పోచయ్య,పంచాయతీ కార్యదర్శి యాదగిరి,వార్డ్ మెంబెర్స్ యాదగౌడ్, ఎల్లయ్య, వెలుగు గ్రామైఖ్య సంఘము అధ్యక్షురాలు యస్. సంధ్య. లక్ష్మి, ఐకేపీ సీసీ నార్మద, VOA మంగమ్మ, SHG గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు