జనం సాక్షి: కొల్లాపూర్ రూరల్ జనవరి. 23
26 జనవరి సందర్భంగాశ్రీనివాస్ క్రీడామైదానంలో ఆటలను ప్రారంభించారు పెంట్లవెల్లి. మండల పరిధిలోని జటప్రోలు గ్రామం లో జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు 26 జనవరి గణతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా క్రీడా పోటీలను ప్రారంభించారు ,ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు,శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు ఆటలు కూడా అవసరమని అటు విద్య ఇటు క్రీడారంగంలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచాలని అందుకు విద్యార్థులను ఆటలలో ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు, ఈ మేరకు గెలుపొందిన విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం రోజున బహుమతులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
జటప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు,




