Wednesday, 4 November 2026

బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో 24,25 నిరాహారదీక్ష లు

 

జహీరాబాద్ జనవరి 23 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నూటికి 52% ఉన్న బీసీలు అసెంబ్లీలో 60 మంది ఉండాలి కానీ 23మంది కే పరిమితం అయిందని పూర్తీ మెజార్టీతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లెక్కల్ని బయట పెట్టకపోవడానికి నిరసనగా రెండు రోజులు బిఎస్పీ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష లు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నియోజకవర్గ అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ
జహీరాబాద్ యూనిట్ అధ్యక్షులు అయిదాల అలెగ్జాండర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బీసీలా సమస్యే ఈ దేశ సమస్య అని నినదించిన మండల్ కమీషన్ అమలుకై పోరాటం చేసిన మాన్యశ్రీ కాన్షిరాం బాటలో బిఎస్పీ అధినేత మాయావతి అడుగుజాడల్ల బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ .ప్రవీణ్ కుమార్ ఆదేశాలమేరకు 27% నుండి 52% కి పెంచాలని తేదీ 24.25. రెండు రోజు జహీరాబాద్ లో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కమిటీ మండల కమిటీ సెక్టార్ కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది అన్నారు.బిసి సంఘాలు నాయకులు అత్యధికంగా విచ్చేసి జయప్రదం చేయాలన్నారు.