Tuesday, 3 November 2026

జడ్పీ చైర్మన్ కు రాఖీ కట్టిన ఆలయ డైరెక్టర్ జనం సాక్షి, కమాన్ పూర్ :

పెద్దపల్లి జిల్ల కమాన్ పూర్ మండలంలో ముందస్తు రాఖీ వేడుకలు ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని ఆదివరహ స్వామి ప్రాంగణంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకు ఆలయ కమిటీ డైరెక్టర్ భూంపల్లి జ్యోతి రాఖీ కట్టారు. మంగళవారం ఆది వరహాస్వామి జయంతోత్సవాలు భాగంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన పుట్టమధుకు రాఖీ కట్టారు.అన్నా చెల్లెల అనుబంధానికి నిదర్శనం రాఖీ వేడుకలని పుట్ట మధు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఇనగంటి ప్రేమలత జగన్నాథరావు స్థానిక సర్పంచ్ నీలం సరిత శ్రీనివాస్ జూలపల్లి సర్పంచ్ బోల్లపల్లి శంకర్ గౌడ్ సిద్ది పల్లె సర్పంచ్ తాటికొండ శంకర్ కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్ నాయకులు ఇనగంటి రామారావు కోలేటి చంద్రశేఖర్, నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.