ఓటర్ జాబితా సవరణ వేగవంతం చేయాలి
మంథని ఆర్డిఓ హనుమ నాయక్
జనంసాక్షి, కమాన్ పూర్ : ఓటర్ జాబితా సవరణ వేగవంతం చేయాలని మంథని ఆర్డిఓ హనుమ నాయక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ తహసిల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ప్రభుత్వం ఓటర్ జాబితా సవరణ కొరకు ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫారం 6 ,7,8 దరఖాస్తుల వివరాలు ఆన్లైన్ గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే బిఎల్ ఓ లకు వచ్చిన దరఖాస్తు ఏ రోజుకు ఆ రోజు విచారణ జరిపి పూర్తి చేయాలని ఆన్లైన్లో నమోదు చేయాలని కోరారు. ధరణి ద్వారా వచ్చిన దరఖాస్తులను మరియు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కారం చేయాలని అన్నారు. ఆయన వెంట కార్యాలయంలో తహసిల్దార్ మోహన్ రెడ్డి గిరిదాబాద్ సంధాని సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరరావు జూనియర్ అసిస్టెంట్ మల్కా రెడ్డి తదితరులు ఉన్నారు.