Tuesday, 3 November 2026

జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శ

జనంసాక్షి, మంథని : జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ త్రండి ఎల్.జి రాం ఇటీవల స్వర్గస్థులు కాగా వారి చిత్రపటానికి బుధవారం మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మెన్ పుట్ట మధూకర్, జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్ పూలమాల వేసి, వారికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.