Tuesday, 3 November 2026

అంబేద్కర్‌ చెరువు ఆధునీకరణతో కొత్త శోభ – ఆహ్లద వాతావరణం కల్పించాలన్నదే మా ఆలోచన – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌

జనంసాక్షి, మంథని : గత పాలకుల హయాంలో మురికికూపంలా మారిన అంబేద్కర్‌నగర్‌ చెరువు ఆధునీకరణతో మంథనికి కొత్త శోభ సంతరించుకుంటుందని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. అంబేద్కర్‌ చెరువును ఆయన పరిశీలించి ఆధునీకరణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తాను ఎమ్మెల్యేగా అయిన వెంటనే అంబేద్కర్‌ చెరువును శుభ్రం చేయించామని తెలిపారు. ఈనాడు పూర్తి స్థాయిలో అంబేద్కర్‌ చెరువును ఆధునీకరించి చెరువు మధ్యలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మంథని పట్టణ ప్రజలకు ఆహ్లదకరమైన వాతావరణం కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని, పట్టణ నడిబొడ్డున ఉన్న రావులచెరువు, తమ్మి చెరువులు ఏ రకంగా ఆధునీకరించ బడుతున్నాయో అదే రీతిలో అంబేద్కర్‌చెరువును ఆధుకరించి అందరికి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. బన్నె చెరువు నుంచి పైప్‌లైన్‌ ద్వారా అంబేద్కర్‌ చెరువులోకి నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.