జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లె గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పెరుమాండ్ల మధునయ్య ను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ శనివారం పరామర్శించారు. ఆయన వెంట మంథని ఎంపీపీ కొండ శంకర్ సింగల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏగోలపు శంకర్ గౌడ్, దుబ్బ పల్లె సర్పంచ్ నరేష్ రావు, నాయకులు తగరం శంకర్ లాల్, ఆకుల కిరణ్ తదితరులు ఉన్నారు.




