కోటగిరి ఫిబ్రవరి 11 జనం సాక్షి:- కోటగిరి మండల కేంద్రానికి చెందిన గ్యాస్ మాధవరావు కుమారుడైన వినోద్ పటేల్ అలాగే చిప్ప సందీప్ సొంత స్థలంలో నిర్మించిన రెండు పడకల ఇండ్లను శనివారం రోజున రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి,లబ్ధిదారుల కుటుంబ సభ్యులు,స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఆయన వెంట జడ్పిటిసి శంకర్ పటేల్,స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు సీరజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అమిద్, స్థానిక సింగిల్ విండో చైర్మన్ కూచి సిద్దు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎజాజ్ ఖాన్,ఎంపీటీసీ విఠల్,ఫారూక్,సలీం,బిఅర్ఎస్ సీనియర్ నాయకులు కొల్లూరు కిషోర్,వల్లేపల్లి శ్రీనివాస్,విజయ్ పటేల్,బర్ల మధు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




