Wednesday, 4 November 2026

జనంసాక్షిగా విజయం మనదే

 

 

 

 

 

 

 

 

బిచ్కుంద ఏప్రిల్ 25 (జనం సాక్షి)పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం అని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని ప్రతి గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ పేదవాని పెన్నిధిగా నిలుస్తున్నారని ఆయన తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన పథకాలకు ఆకర్షితులై వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుర్చుకుంటున్నారని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని జుక్కల్ నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే షిండే పేర్కొన్నారు.