Wednesday, 4 November 2026

తండ్రిని హత్య చేసిన కూతుర్లకు బెయిల్ మంజూరు పై గ్రామస్తులు నిరసన

 

 

 

 

 

రాజంపేట్ ఏప్రిల్ 24 (జనంసాక్షి)రాజంపేట్ మండల కేంద్రంలో తండ్రిని హత్య చేసిన కూతుర్లు బెయిల్ మంజూరు చేయడంపై గ్రామస్తులు నిరసన తెలిపారు భారతీయ స్టేట్ బ్యాంక్ ఎదుట ప్రధాన మెయిన్ రోడ్డు పైకి బటాయించారు గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు ధర్నా చేపట్టారు వారిని గ్రామ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు  సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ధర్నా కొనసాగింది రాస్తారోకో వల్ల పలు వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి ఆర్టీసీ ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా మారిందని ప్రయాణికులు చిన్న పిల్లలు ఉన్నారు ఎండాకాలం ఎంత ఇబ్బంది అవుతున్నది పోలీసు వాళ్ళు వారి పైన కఠిన చర్యలు తీసుకొని తొందరగా రోడ్డు క్లియర్ చేయాలని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న బిక్నూర్ సిఐ తిరుపతయ్య దోమకొండ ఎస్సై బిక్నూర్ ఎస్సై రాజంపేట్ ఎస్సై పోలీస్ బృందంతో చేరుకొని గ్రామస్తులను సద్ది చెప్పి చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు పోలీసులు తెలిపారు