జనంసాక్షి, మంథని : సిమెంట్ రోడ్డు మంజూరు ఒక చోట.. పనులు మరొక చోట..!, పెంచికల్ పేటలో నిబంధనలకు విరుద్ధంగా సిసి రోడ్డు నిర్మాణం, అధికారుల అండతో పాలకుల నిర్వాహకం..?, నిధులు మంజూరైన హనుమాన్ గుడి వరకు రోడ్డు వేయాలని గ్రామస్తుల డిమాండ్ అనే శీర్షికతో జనంసాక్షి లో బుధవారం ప్రచురితమైన కథనానికి పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ స్పందించారు. ఈ మేరకు బుధవారం పెద్దంపేట ఆర్ అండ్ ఆర్ కాలనీలో వేసిన సిసి రోడ్డును పెద్దపల్లి డిఆర్డిఓ శ్రీధర్, కమాన్ పూర్ ఎంపీడీవో విజయ్ కుమార్ తదితరులతో కలిసి పరిశీలించారు. కమాన్ పూర్ మండలం పెంచికల్ పేట గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద పెంచికల్ పేట మెయిన్ రోడ్డు నుంచి హనుమాన్ గుడి వరకు సిమెంట్ రోడ్డు వేయడానికి రూ. 20 లక్షలు మంజూరు కాగా.. అయితే పాలకులు, అధికారులు ఒకటై ఇక్కడ వేయాల్సిన సిమెంట్ రోడ్డును నిబంధనలకు విరుద్ధంగా పెద్దంపేట ఆర్ అండ్ ఆర్ కాలనీలో వేయడం పై ఆరా తీశారు. సిమెంట్ రోడ్డు అసలు ఎక్కడికి మంజూరు అయింది..దానికి తీర్మానం ఏమి ఇచ్చారు.. తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక అందించాలని డి ఆర్ డి ఓ శ్రీధర్ ను అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ఒకవేళ సీసీ రోడ్డు ఒక చోటికి మంజూరై మరో చోట పనులు చేపడితే మాత్రం బిల్లు చెల్లించడం జరగదని అడిషనల్ కలెక్టర్ స్పష్టం చేశారు.
“జనంసాక్షి” కథనానికి స్పందన నిబంధనలకు విరుద్ధంగా వేసిన సిసి రోడ్డును పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ కుమార్




