Tuesday, 3 November 2026

సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట

సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట
పారిశ్రామిక వేత్తలు, నేర నియంత్రణ మెరుగైన సమాజం కొరకు సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి
జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సిసి కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా జిల్లా పోలిసుల కృషి.
జిల్లా యస్.పి కె.అపూర్వ రావు ఐ.పి.యస్
మిర్యాలగూడ, జనం సాక్షి. పోలీస్ కార్యాలయం నందు సామాజిక భద్రత (సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీ) పైన వివిధ కంపెనీలకు చెందిన  పారిశ్రామిక వేత్తలతో  నిర్వహించిన సమావేశంలో  జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ  పోలీస్ శాఖ నేర నియంత్రణ మెరుగైన సమాజ నిర్మాణం  కొరకు సిసి కెమెరాల  ఏర్పాటుకు కృషి చేస్తుంది. పోలీసు శాఖ తీసుకుంటున్న సిసి కెమెరాల ఏర్పాటు సహకరిస్తూ ప్రతి గ్రామాలలో,పట్టణాలలో, వ్యాపార సముదాయాలు, రహదారి కూడలిలో  సిసి కెమెరాలను ఏర్పాటు చేసేలా వివిధ  కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ  మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సిసి కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయని, వీటిని ప్రతి ప్రాతంలో ఏర్పాటు చేయడం ద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించడంలో సిసి కెమెరాలు కీలకంగా మారుతున్నాయని,అనేక కేసులును ఛేదించడంలో, దొంగతనాలు జరిగినప్పుడు సిసి కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినమని, ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని అప్పుడే గ్రామీణ ప్రాంతాలలో నేరాలను నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించేలా చేయడంలో సిసి కెమెరాలు ఉపయోగపడతాయని, అంతే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే సందర్భంలో చాలా కేసులలో సిసి కెమెరాల ద్వారా గుర్తించి బాధితులకు న్యాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ప్రముఖ రైస్ మిల్లర్, వ్యాపార వేత్త వింజం రాజేంద్ర ప్రసాద్,  సిసి కెమెరాల ఏర్పాటు కొరకు ఒక లక్ష  రూపాయల చెక్కును  యస్.పి కి అందజేశారు . ఈ సందర్భంగా యస్.పి. అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి యస్.పి మిర్యాలగూడ వెంకటగిరి, సిఐ రాఘవేందర్, వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్. ఐ సంతోష్  వివిధ పరిశ్రమలకు చెందిన నాట్కో  రాజకుమార్, రైస్ మిల్ అసోసియేషన్ రాజేంద్ర ప్రసాద్, గౌరు శ్రీనివాస్, రంగా లింగయ్య ,వెంకట్ రమణ చౌదరి ,, బి.హెచ్. ఈ యల్. ఏ.కె.సింగ్,బాలరాజు,ఇండియన్ సిమెంట్ సుదీర్ రెడ్డి, మెగా ఇంజనీరింగ్ నవీన్ రెడ్డి,ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.మధు కుమార్,  తదితరులు పాల్గొన్నారు.