Wednesday, 4 November 2026

జనంసాక్షి క్యాలెండర్ ను ఆవిష్కరించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

 

 

 

 

 

మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 13,జనంసాక్షి :మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జనంసాక్షి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక తదితర అన్ని వర్గాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపి ఏ స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కొరకు నిరంతరం పాటుపడతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు జర్నలిస్టులు ముందు ఉంటారని అన్నారు.అలాగే అవినీతి అక్రమాలపై కథనాలను, నిజాలను నిర్భయంగా రాస్తూ అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెల్తరని, పత్రికలు అంటే ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభమని అని వర్ణించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, మున్సిపల్ కో అప్సన్ మెంబర్స్, కౌన్సిలర్లు, ఓజ్జెల బుచ్చిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, వంగల మహేష్, మెట్ పల్లి జనంసాక్షి విలేఖరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు