Wednesday, 4 November 2026

నిరుపేద యువతి వివాహానికి ఆసరగా నిలిచిన ఎంపిపి గడ్డం శ్రీనివాస్ 40 వేల రూపాయల ఆర్థిక సహాయం

 

 

 

 

 

 

దండేపల్లి. జనంసాక్షి జనవరి 13 దండేపల్లి మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువతి కుదురుపాక సంధ్యారాణి వివాహానికి దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ తన సొంత డబ్బులతో పాటు మిత్రుల ద్వారా సేకరించిన 40 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఉదారత చాటుకున్నారు వివరాల్లోకి వెళితే చింతపల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువతి కుదురుపాక సంధ్యారాణి తండ్రి గత ఏడు సంవత్సరాల క్రితం చనిపోయాడు సంధ్యారాణికి పెళ్లి చేసే స్థోమత తల్లి సత్తవ్వ కు లేకపోవడంతో ఎంపిపి గడ్డం శ్రీనివాస్ ను సంప్రదించగా స్పందించిన ఎంపిపి సేకరించిన 40 వేల రూపాయలను సోమవారం చింతపల్లి గ్రామంలోని యువతి ఇంటికి వెళ్ళి నగదు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆడ కూతురు పెళ్లి చేయడానికి స్తోమత లేని వారు సంప్రదిస్తే నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అక్కల తిరుపతి,మాజీ ఉపసర్పంచ్ గొర్ల మధుకర్,తెలంగాణ జాగృతి నియోకవర్గ అధ్యక్షులు చుంచు చందు,నాయకులు గోపతీ పోచయ్య, చెల్ల రవి,కుదురుపాక ఇందు, మేడిషెట్టి రాయలింగు,గంప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.