హుజూర్ నగర్ మార్చి 3 (జనంసాక్షి): హుజుర్ నగర్ మునిసిపాలిటీ పరిధిలోని మాధవ రాయిని గూడెం 1వార్డ్ లో నివాసం ఉంటున్న మౌలాల వెంకమ్మ వృద్దురాలు తీవ్ర ఇబ్బందులతో సతమతం పడుతున్న విషయం జనచైతన్య ట్రస్ట్ సభ్యుల దృష్టికి రావడంతో జనచైతన్య ట్రస్ట్ తరుపున శుక్రవారం 25కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చెయ్యడం జరిగింది.
పేరూరి (శ్రీదేవి కీర్తిశేషులు) ఆమె పుట్టినరోజు సందర్బంగా భర్త శ్రీకాంత్ ఆమె పుట్టినరోజు గుర్తుగా పేదలకు సేవ చేయాలనీ ఆలోచనతో జనచైతన్య ట్రస్ట్ ను సంప్రదించి ట్రస్ట్ సభ్యులకు 25 కేజీల బియ్యం డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ సమాజంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని మావంతు బాధ్యతగా జన చైతన్య ట్రస్ట్ ద్వారా ఆదుకునేందుకు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య ట్రస్ట్ పౌండర్ పినపారాళ్ళ వంశీ, కార్యదర్శి దగ్గుపాటి రమేష్, బీవీ శ్రీపతి, కాశీవిశ్వనాథ్, గడ్డం అంజయ్య, ప్రసాద్, లక్ష్మయ్య, లింగయ్య, నిర్మల, చంద్రకళ లు పాల్గొన్నారు.
[6:47 PM, 3/3/2023] +91 85200 80662: నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
హుజూర్ నగర్ మార్చి 3 (జనం సాక్షి): పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యులు నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపి వారిని సన్మానించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతగాని లక్ష్మమ్మ, వైస్ చెర్మెన్ ముడెం రామలింగారెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జనచైతన్య ట్రస్ట్ ద్వారా పేద కుటుంబాలకు అండ




