హుజూర్ నగర్ మార్చి 3 (జనం సాక్షి): పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యులు నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపి వారిని సన్మానించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతగాని లక్ష్మమ్మ, వైస్ చెర్మెన్ ముడెం రామలింగారెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే




