జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఉత్తర మండల డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పఠాన్‌కోట్ ఘటన నేపథ్యంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్యాట్నీ ప్లైఓవర్‌ను మూసివేస్తున్నామని పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్‌తో పాటు సీఎం కేసీఆర్, ఉన్నతాధికారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు




