Tuesday, 3 November 2026

రైల్లో గోనె సంచిలో మహిళ మృతదేహం…

vh1ftt1zహైదరాబాద్ : గుంటూరు – కాచిగూడ ప్యాసింజర్ రైల్ లో కలకలం రేగింది. రైలు బాత్ రూంలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఉదయం నగరానికి చేరుకున్న రైలులో క్లీన్ చేయడానికి కాంట్రాక్టు కార్మికులు వెళ్లారు. బాత్ రూంలో గోనె సంచి ఉండడం అందులో మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులకు తెలిచేశారు. వెంటనే రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ శరీరంపై బలమైన గాయాలున్నాయి. సంబంధిత మహిళను చిత్ర హింసలకు గురి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మహిళ ఎవరనేది తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *