జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.
ఫొటో : అన్నదానం చేస్తున్న సభ్యులు.
బెల్లంపల్లి, నవంబర్ 30, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కెల్ల అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని అన్నారు. దాతల సహకారంతో ఈకార్యక్రమం గత ఏడాది ఏప్రిల్ 13న ప్రారంభించామని, వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేటితో 143వ సారి అన్నదానం చేసినట్లు తెలిపారు. నేటి కార్యక్రమం అనుమాండ్ల రాజవ్వ గంగయ్య దంపతుల జ్ఞాపకార్థం వారి కొడుకు కోడలు అనుమాండ్ల భవాని రాజేష్ మనుమడు సాత్విక్ శ్రీరామ హ్యాండ్ లూమ్స్ మంచిర్యాల సహకారంతో యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు, చిరు వ్యాపారులకు, బాటసారులకు ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదానం చేసినట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమం ద్వారా సుమారు 180 మందికి అన్నదానం చేశామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని, ఇప్పటిదాకా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు ముల్క లక్ష్మి, రాజ్ కుమార్, జనహిత సేవా సమితి సభ్యులు సాంబారి నర్సయ్య, మేరుగు దేవయ్య, పాయబోయిన మల్లేష్, సింగతి తిరుమల్, బోలిశెట్టి సుధాకర్, మేరుగు లక్ష్మీనారాయణ, నిచ్చకోలా గురుస్వామి, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.




