Wednesday, 4 November 2026

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం: అన్నదానం చేస్తున్న జనహిత సేవా సమితి సభ్యులు.

.

 

 

 

 

బెల్లంపల్లి, మే 10, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కెల్ల అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని అన్నారు. దాతల సహకారంతో ఈకార్యక్రమం గత ఏడాది ఏప్రిల్ 13న ప్రారంభించామని, వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేటితో 173వ సారి అన్నదానం చేసినట్లు తెలిపారు. నేటి కార్యక్రమం పేరు తెలపడం ఇష్టం లేని గుప్త దాత సహకారం తో యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు, చిరు వ్యాపారులకు, బాటసారులకు ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదానం చేసినట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమం ద్వారా సుమారు 180 మందికి అన్నదానం చేశామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని, ఇప్పటిదాకా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్, గౌరవ సలహాదారుడు కందుల రాజన్న, సభ్యులు ఈర్ల శంకర్, ఇప్ప రవి, నిచ్చకోలా గురుస్వామి, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.