Wednesday, 4 November 2026

సిరిసిల్ల మర మగ్గాల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ఎత్తివేసి కుట్రలను తిప్పుకొట్టాలి. సిపిఐ నాయకులు పంతం రవి.

 

 

 

 

 

 

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 9.,(జనంసాక్షి). సిరిసిల్ల మురముగ్గాల పరిశ్రమలు ఇస్తున్న 50 శాతం విద్యుత్ సబ్సిడీని ఎత్తివేసే కుట్రలను చిప్పికొట్టవలసిన అవసరం ఉందని సిపిఐ నాయకులు పంతం రవి అన్నారు. బుధవారం కార్మిక భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రవి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మర మగ్గాల పరిశ్రమకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. కేవలం ఒకే మీటర్ పై సబ్సిడీ కొనసాగిస్తామంటూ ప్రచారం జరుగుతోందని తెలిపారు. యధావిధిగా మరమగ్గాల పరిశ్రమకు ఇస్తున్న 50 శాతం విద్యుత్ సబ్సిడీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సబ్సిడీ ఎత్తివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను కలిసికట్టుగా తిప్పి కొట్టాలని అన్నారు. సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు సామల మల్లేశం, నల్ల చంద్రమౌళి, వేణు, రమేష్, నాగరాజు పాల్గొన్నారు.