Tuesday, 3 November 2026

జనాలపైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ.. డిగ్రీ విద్యార్థిని దుర్మరణం..

సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్స్ కు వెళుతున్న డిగ్రీ విద్యార్థిని టిప్పర్ ఢీకొని దుర్మణం చెందింది.  డిగ్రీ చదువుతున్న స్వప్న ఎన్ సీసీ కేడెట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ నెల 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకోనున్న స్వప్న, అందుకోసం రిహార్సల్స్ చేసుకునేందుకు బయలుదేరింది. 
అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ టిప్పర్ అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. స్వప్నను ఢీకొట్టింది. దీంతో స్వప్న తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదం నేపథ్యంలో రైల్ నిలయం పరిసరాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్థంబించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్వప్న మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *