Wednesday, 4 November 2026

జన్మదినం సందర్భంగా అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామి వారిని దర్శించుకున్న వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు

 

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 19 (జనం సాక్షి)వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా తన బాధ్యతను 100% నిర్వర్తిస్తూ.. వికారాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, సమస్య ఉందని తెలియగానే వెంటనే స్పందించి పరిష్కరిస్తూ ప్రజల మనసు గెలుచుకున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్ వైస్ చైర్ పర్సన్ మరియు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అనంతగిరి *శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ మరియు పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా చల్లగా చూడాలని చైర్ పర్సన్ దంపతులు స్వామివారిని ప్రార్థించారు.
ఇదే రోజు పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తన సతీమణి ప్రతిమ పెళ్లి రోజు కూడా కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దంపతులకు, చైర్ పర్సన్ దంపతులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే దంపతులు సైతం వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్*జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.