Wednesday, 4 November 2026

జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చేయూత

 

 

 

 

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 6 (జనం సాక్షి): జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు గురువారం పంపిణీ చేశారు. హుజూర్ నగర్ పట్టణంలోని 15 వ వార్డుకు చెందిన కుడి తొట్టి నాగార్జున కొన్ని రోజుల క్రితం చెట్టు పైనుండి కిందకు పడడంతో తనకి వెన్నుపూస గాయం అయింది. తన కుటుంబ పోషణనాకు గాను జనసేన పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గం కార్యనిర్వాహకులు సరికొప్పుల నాగేశ్వరరావువిజయలక్ష్మి కూతురు చైత్ర పుట్టినరోజు సందర్బంగా జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 25కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ సరికొప్పుల నాగేశ్వరరావును ఆదర్శంగా తీసుకొని మీ జీవితంలోని సంతోష క్షణాలను మరొక పేద కుంటుంబానికి సాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ పినపారాళ్ల వంశీ, దగ్గుపాటి రమేష్, కాశీవిశ్వనాథ్, సిపాయినాయక్, బాబురావు, అశోక్, కోల్లపూడి చంటి లు పాల్గొన్నారు.