వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 6 జనం సాక్షిశ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించి కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలు నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలకు జ్ఞానం కలిగి ప్రజలందరినీ సమానంగా చూడాలని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు గురువారం శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవం సందర్భంగా వికారాబాద్ ఐటిఐ లో గల ఆంజనేయ స్వామి దేవాలయంలో అదేవిధంగా బండ బావి వీరాంజనేయ స్వామి*దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదలు స్వీకరించిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ద. సుధాకర్ రెడ్డి టి పి సి సి సోషల్ మీడియా కార్యదర్శి రఘుపతి రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ముదిరాజ్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు




