Thursday, 5 November 2026

జన సందోహం మధ్య అమర జవాన్ పబ్బాల అనిల్ అంతిమయాత్ర

 

 

 

 

 

 

 

 

 

బోయిన్ పల్లి మే 06 (జనం సాక్షి)జమ్మూ కశ్మీర్ లోని కిష్ట్వార్ జిల్లాలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన పబ్బాల అనిల్ మృతదేహాం సైనిక లాంచనాల మధ్య రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయిన్ పల్లి మండలం లోని స్వగ్రామామైన మల్కాపూర్ చేరుకుంది. మార్గమధ్యమంలో గంగాధర వద్ద ఆయనకు ప్రజలు ఘన నివాళులు అర్పించారు. గంగాధర నుంచి మల్కాపూర్ వరకు భారీ జనసందోహం మధ్య అంతిమ యాత్ర కొనసాగింది. ఇండియన్ ఆర్మీకి చెందిన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్లో సాంకేతిక లోపం తో కిష్ట్వార్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో, టెక్నీషియన్ అనిల్ మృతి చెందగా ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. అనిల్ ఆర్మీలో గత 11 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అనిల్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనిల్ గత 15 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చి వెళ్లాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ మధ్యే విధుల్లో చేరాడు. కొన్ని రోజులకే ప్రమాదవశాత్తు ఈ దుర్ఘటన జరిగి మృతిచెందాడు. అనిల్ మృతి వార్త విని అటు కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి భారీగా ప్రజలు యువకులు చేరుకొని అమర జవాన్ పబ్బల అనిల్ అంతిమయాత్రలో పాల్గొన్నారు.