Thursday, 5 November 2026

జబిజెపి వియోబరాలు…త్సవ సం

జబిజెపి వియోబరాలు…త్సవ సం

భైంసా రూరల్ డిసెంబర్ 08 జనం సాక్షి

 

గుజరాత్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో 151 స్థానాలలో బిజెపి గెలిచిన సందర్బంగా గురువారం విజయోత్సవ సంబరాలను బైంసా పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి ముందర బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. టపాకాయలు పేల్చి స్వీట్లు పంచారు. అనంతరం బిజెపి నాయకులు మాట్లాడుతూ… గుజరాత్ రాష్ట్రంలో 182 సీట్లకి బిజెపి పార్టీ అత్యధికంగా 151 సీట్లు గెలుచుకొని 7 వ సారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మోడీ నిజాయితీ పాలనకు నిదర్శనమని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు యాను పోతుల మల్లేష్, మరియు కౌన్సిలర్లు రావుల సువర్ణపోశెట్టి, అనితబాలాజీ సూత్రవే,సాహేబ్ రావ్ మరియు స్వచ్ఛభారత్ జిల్లా అధ్యక్షులు రమేష్ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అనిల్,ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు మారుతి,మాజీ కౌన్సిలర్ రఘువీర్,మాజీ పట్టణ అధ్యక్షులు నాగనాథ్, కార్యకర్తలు పాల్గొన్నారు.