Thursday, 5 November 2026

జుక్కల్ ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి

జుక్కల్ ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి
అఖిలపక్ష నాయకుల డిమాండ్
జుక్కల్, డిసెంబర్ 8, (జనంసాక్షి ),
జుక్కల్ ను రెవిన్యూ డివిజన్ గా , భాన్స్ వాడా ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిల పక్ష నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ విషయమై అఖిల పక్ష నాయకులు గురువారం జుక్కల్ నాయబ్ తహసీల్దార్ విజయలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. అఖిలపక్ష నాయకులు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జుక్కల్ ను రెవిన్యూ డివిజన్ గా, భాన్స్ వాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనిఅఖిలపక్ష నాయకులు నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తా నుండి తహాసీల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నాయబ్ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతు ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రం కామారెడ్డి, జుక్కల్ నుండి 115కిలోమీటర్ల దూరం లో ఉందని తెలిపారు. జుక్కల్ నుండి జిల్లా కేంద్రానికి వెళ్ళి పనులు చేసుకోవడానికి ఒక రోజు సరిపోవడం లేదని తెలిపారు. బస్సు సౌకర్యం కూడ సరిగా లేదని అన్నారు. బాన్స్ వాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే చాలా సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. జుక్కల్ నుండి బాన్స్ వాడా 45కిలోమీటర్ల దూరంలోనే ఉందని తెలిపారు. ఒక్క రోజులో బా న్స్ వాడాకు వెళ్లి పనులు చేసుకోవచ్చని తెలిపారు. జుక్కల్ నియోజక వర్గ కేంద్రంగా ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని జుక్కల్ ను రెవిన్యూ డివిజన్ గా చేయాలని వారు కోరారు. జుక్కల్ రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తే నియోజక వర్గంలోని జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, డోoగ్లి,, పెద్ద కొడప్గల్, పిట్లం, నిజాంసాగర్ మండలాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. నియోజక వర్గం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి యశోద నీలుపాటిల్, జడ్ పిటిసి లక్ష్మిబాయి దాదారావ్, వైస్ ఎంపిపి ఉమాకాంత్ దేశాయ్,సింగిల్ విండో చైర్మన్ నాగల్ గి ద్దే శివానంద్, స్ధానిక సర్పంచ్ బొంపెల్లి రాములు, మండల టిఆర్ ఏస్ అద్యక్షులు మాధవ్ రావ్ దేశాయ్,మాజి సర్పంచ్ బొల్లి గంగాధర్, మాజి ఎంపిపి బసంత్ శెట్కార్, మాజి జడ్పీటిసి పండరి కాంబ్లే, మాజి జేఎస్సీ చైర్మన్ గాంగాధర్ రెడ్డి, అఖిల పక్ష నాయకులు మహేబూబ్ సాబ్, వాసురే రమేష్, అవినాష్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.