Friday, 6 November 2026

జమ్మాపూర్ గ్రామ ఉపసర్పంచ్ ఓ మహిళపై లైంగిక వేధింపులు

జమ్మాపూర్ గ్రామ ఉపసర్పంచ్ ఓ మహిళపై లైంగిక వేధింపులు

*బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, కేసు నమోదు

*సదరు వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రకటన

పానుగల్ నవంబర్14,జనంసాక్షి
తనతో గడపాలంటూ ఓ మహిళతో గ్రామ ఉపసర్పంచ్ అసభ్య రీతిలో ఫోన్ కాల్ చేసి వేధించిన సంఘటన పానగల్ మండలంలో చోటుచేసుకుంది.సమస్యలో ఉన్నాను సాయం చేయాలని అడిగిన పాపానికి ఆ మహిళతో నాయకుడు అసభ్యంగా మాట్లాడి, భర్త లేని ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకుని పశువులా ప్రవర్తించాడు. స్థలం ఇప్పియ్యాలని కోరిన ఆ వితంతువును తనతో ఓ రాత్రి గడపాలంటూ హుకుం జారీ చేశాడు. లేదంటే జీవితంలో ఆ స్థలం దక్కకుండా చేస్తానని హెచ్చరించాడు. ఆ మహిళతో అతను మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే…పానుగల్ మండలం జమాపూర్ గ్రామానికి చెందిన ప్రస్తుత గ్రామ ఉపసర్పంచ్ నాగరాజు తమ బంధువైన ఓ మహిళకు ఫోన్ చేశాడు.ఆమెకున్న భూ సమస్య గురించి మాట్లాడుతూ,తాను ఇప్పుడే ఆ స్థలం వద్దే ఉన్నానని, తన కోరిక తీరిస్తే సమస్యను పరిష్కరిస్తానని చెప్పాడు.తనతో ఒక్క రాత్రి గడిపితే చాలు భూ సమస్యను చిటికెలో పరిష్కరిస్తానని మాట్లాడాడు. దాంతో షాక్ కు గురైన ఆ మహిళ ఇంట్లో అందరూ ఉన్నారని,అలా చేయడం కరెక్ట్ కాదంటూ బతిమిలాడింది. అయినా కామంతో కళ్లు మూసుకుపోయిన అతడు ఆమె మాటలు పట్టించుకోకుండా, కాళ్లు మొక్కుతా తన కోర్కె తీర్చాలంటూ పశువులా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి,ఆడియో రికార్డ్ ను ఫిర్యాదు కాపీకి జత చేసి సదర్ వ్యక్తిపై ఫిర్యాదు చేయగా… సెక్షన్ 354డి,506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగన్న తెలిపారు.