Friday, 6 November 2026

విద్యార్థుల సేవలో భద్రకాళి మహిళా సంక్షేమ మండలి

విద్యార్థుల సేవలో భద్రకాళి మహిళా సంక్షేమ మండలి

– ప్లేట్లు.. స్లేట్లు.. పరీక్ష ప్యాడ్ల అందజేత

– అరవింద స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం

 

వరంగల్ ఈస్ట్, నవంబర్ 14(జనం సాక్షి)

భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి (బాలల దినోత్సవం) సందర్భంగా సోమవారం నగరంలోని రంగశాయిపేటలో గల అరవింద పబ్లిక్ స్కూల్ లో ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ పంచకం నర్సయ్య ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులు వారి వారి పాత్రలలో ఇమిడిపోయి పాఠాలను చక్కగా బోధించారు. సబ్జెక్టుల వారీగా పిల్లలు చక్కటి వేషధారణతో చూడ ముచ్చటగా తయారై వచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో రంగశాయిపేటకు చెందిన భద్రకాళి మహిళా సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పిల్లలకు 85 పరీక్ష ప్యాడ్లు, 85 స్లేట్లు, 85 పెన్నులు, 500 స్లేట్ పెన్సిల్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పంచకం రమాదేవి, భద్రకాళి మహిళా సంక్షేమ మండలి అధ్యక్షురాలు పోతు రమాదేవి, కార్యదర్శి గజ్జి రమాదేవి, కోశాధికారి చిట్ల సంధ్యారాణి, ఉపాధ్యక్షురాలు కావటి రమాదేవి, ముఖ్య సలహాదారు బజ్జురి జయగౌరి, సభ్యులు మిట్టపల్లి రమాదేవి, మాటేటి శారద, తిరునగరి గీత, పోతు ధనలక్ష్మి, వంగ అనూష, సకినాల సునిత, చిమ్మని భార్గవి, ఆకుతోట అనూష, కుసుమ కవిత, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.