హైదరాబాద్ : తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నేతలు గస్పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషిని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణకు ప్రధాన అడ్డంకి కేసీఆర్నని, ఆయన వల్వే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం లేదని తెదేపా ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.




