గుంటూరు,(జనంసాక్షి): గుర్తు తెలియని వ్యక్తులు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక పాత మార్కెట్ సెంటర్‌లో ఉన్న శ్రీరాములు విగ్రహం తల,మెడ భాగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఉదయం దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్యవైశ్య ప్రముఖులు విగ్రహం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.




