కంటోన్మెంట్ జనం సాక్షి ,మే 05అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ( హెచ్ యు జె – టి డబ్ల్యు జే ఎఫ్ ) బృందం మంత్రి తలసాని యాదవ్ కు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ప్రభుత్వం స్థానికంగా ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తోందని, హైదరాబాద్ జిల్లాలో జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు లేదా ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని
రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ ఇప్పటికే పలు మార్లు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.ఈ మేరకు టిడబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఇ.చంద్ర శేఖర్ ఆధ్వర్యంలోహెచ్ యు జే బృందం శుక్రవారం హైదరాబాద్ లో మంత్రికి వినతి పత్రం అందజేసింది.మంత్రి స్పందిస్తూ, అన్ని వర్గాల ప్రజలనురాష్ట్ర ప్రభుత్వం అదుకొంటుందని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు కేటాయింపు తమదృష్టిలో ఉన్నదని సానుకూలంగా స్పందించారు.మంత్రిని కలిసిన వారిలో హెచ్ యు జే కార్యదర్శి జగదీశ్,కోశాధికారి రాజశేఖర్,ఆర్గనై యిజింగ్ సెక్రటరీ నాగవాణి,హెచ్ యు జే నాయకులు అచ్చిన ప్రశాంత్,రేణయ్య, టి డబ్లూజేఎఫ్ కార్యదర్శి కొప్పు నిరంజన్, పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.




