బెల్లంపల్లి, మే 5, (జనంసాక్షి )రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం కోణంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మహనీయుని విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడం అంటే నిజంగా గొప్ప కార్యక్రమం అని, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటు పడిన ప్రపంచ మేధావి విగ్రహాన్ని తన చేతుల మీదుగా జరగడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ సంతోషం రమాదేవి – ప్రతాప్ రెడ్డి, జడ్పీటీసీ సింగతి శ్యామల – రాంచందర్, స్థానిక సర్పంచ్ కంకణాల తిరుపతి రెడ్డి, హైదరాబాద్ డిఎంహెచ్ఓ జుమ్మిడి వెంకట్, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, మండలంలోని ఎంపీటీసీలు, ఇతర గ్రామ పంచాయతీల సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు పంజాల విద్యా సాగర్ గౌడ్, తెలంగాణ నేతకానీ మహర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్, తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జాడి ముసలయ్య, దళిత సంఘాల నాయకులు దుర్గం నర్సయ్య, విగ్రహ ఆవిష్కరణ కమిటీ చైర్మన్ రాంటెంకి శ్రీనివాస్, బీఆరెస్ నాయకులు, విగ్రహ ఆవిష్కరణ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




